
లవర్తో గడిపేందుకు టైమ్ లేదని రూ.3.4 కోట్ల జీతం వదిలేసుకుంది
ఓ మహిళ జాబ్ వదిలేసుకోవడానికి కారణం తెలిస్తే షాక్ కు గురవుతారు. స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ గూగుల్ కార్యాలయంలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ గా ఫ్లోరెన్స్ పోయిరెల్ పని చేస్తున్నారు. తన ఉద్యోగం తన ప్రియుడితో సమయం గడపడానికి ఆటంకం కలిగిస్తుందని 3.4 కోట్ల వార్షిక జీతం గల తన ఉద్యోగాన్ని వదిలేసుకుంది.తన పని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నానని మరింత సమతుల్యమైన, అర్థవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నానని వెల్లడించింది.




