
ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్.. ఐఫోన్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసిన బాస్
యూఏఈకి చెందిన ‘వరల్డ్ స్టార్ మ్యాన్‌పవర్’ సంస్థ తమ ఉద్యోగులకు సర్ప్రైజ్ గిఫ్ట్‌లు అందించింది. ప్యాక్ చేసిన గిఫ్ట్‌లలో ఒక్కో ఉద్యోగి తనకు నచ్చిన ప్యాక్‌ను ఎంచుకునే అవకాశం కల్పించింది. కొందరికి ఐఫోన్లు, మరికొందరికి చాక్లెట్లు రావడంతో ఉద్యోగులు ఆశ్చర్యపోయారు. అయితే చివర్లో చాక్లెట్లు పొందిన ఉద్యోగులకు కూడా ఐఫోన్లు అందించి సంస్థ సర్ప్రైజ్ చేసింది. ఉద్యోగుల అంకితభావం, సామూహిక కృషికి గుర్తింపుగా ఈ కానుకలు ఇచ్చినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్ తెలిపారు.




