
ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో అంతమొందించాలి
సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో 13 మంది మరణించడంపై అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ లోని వై జంక్షన్ కూడలి వద్ద ప్లకార్డులు చేతబూని, ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
































