కబ్జచేరలో చిక్కుకుని నిర్వీర్యమైన బతుకమ్మ ఎట్టకేలకు ఊపిరిపోసుకుంది. ఎన్నో అవాంతరాలు, కేసుల అనంతరం బతుకమ్మ కుంటను హైడ్రా బతికించింది. సీఎం రేవంత్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విహెచ్ తో కలిసి బతుకమ్మ కుంటను ప్రారంభించి అందులో బతుకమ్మను వదిలారు. అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. 15 ఎకరాల చెరువు భూమి కబ్జాకు గురై చెత్త మాత్రమే ఉంది. ఇందులో పేదల ఇళ్ళను కూల్చకుండా కబ్జాదారుల ఆక్రమణలు మాత్రమే తొలగించి పునరుద్ధరించామని తెలిపారు.