అంబర్ పేట్: ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ. 5 కే అల్పాహారం

77చూసినవారు
అంబర్ పేట్: ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ. 5 కే అల్పాహారం
GHMC పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ. 5 కే అల్పాహారం అందించనుంది. ఒక్కో ప్లేటుకు రూ. 19 ఖర్చు కానుండగా అందులో లబ్ధిదారుల నుండి రూ. 5 వసూలు చేస్తారు. ప్రభుత్వం రూ. 14 భరిస్తుంది. తాజాగా ఇందుకు సంబంధించిన మెనూ విడుదలైంది. తొలిరోజు మిల్లెట్ ఇడ్లీ, రెండో రోజు మిల్లెట్ ఉప్మా, మూడోరోజు పొంగల్, నాలుగోరోజు ఇడ్లీ, ఐదోరోజు పొంగల్, ఆరోరోజు పూరి (3), ఆలూ కూర్మ పెట్టనున్నారు.

సంబంధిత పోస్ట్