వచ్చే ఎన్నికల్లో
బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని, తాను ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అవుతానంటూ వస్తున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇదొక సినిమా స్క్రిప్ట్ లాంటిదని,
బాహుబలి కంటే పెద్ద హిట్ అవుతుందని సెటైర్లు వేశారు. తన పరిధి చిన్నదని, తాను తెలంగాణలోనే ఉంటానని స్పష్టం చేశారు.