తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, భారత్‌లోని ఘనా హైకమిషనర్ ప్రొఫెసర్ క్వాసి ఒబిరి-డాన్సో సోమవారం కలిశారు. హైకమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్వాసి ఒబిరి-డాన్సో హైదరాబాద్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఇరువురు పరస్పర సహకారంపై చర్చించారు. విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ మరియు వాణిజ్యం వంటి రంగాలలో ఘనా మరియు తెలంగాణ మధ్య సంబంధాలను మరింత పెంపొందించుకోవడపై చర్చలు జరిపారు.