ఆదివారం అంబర్‌పేట్‌లో పునరుద్ధరించిన బతుకమ్మ కుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే కాలేరు, ఎమ్మెల్సీ వెంకట్, హైడ్రా కమిషనర్, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. చెరువులో బతుకమ్మలు వదిలి గంగమ్మ తల్లికి సీఎం ప్రత్యేక పూజలు చేశారు.