ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ

464చూసినవారు
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా, రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్ లో “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. నాణ్యతలో రాజీపడొద్దని అధికారులను సీఎం ఆదేశించారు. ఫ్యూచర్ సిటీని సింగపూర్, టోక్యో, న్యూయార్క్ తరహాలో అభివృద్ధి చేస్తామని, జూన్ 2 లోగా డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. భూములిచ్చిన రైతులకు ఉద్యోగాలు కల్పిస్తామని, కాలుష్యకారక ఫార్మా సిటీని వ్యతిరేకించి ఈ భవిష్యత్ నగరాన్ని తీసుకొచ్చామన్నారు.

సంబంధిత పోస్ట్