తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రధానికి అందజేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ఈ సమ్మిట్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుంది.