హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ 6 నెంబర్ జంక్షన్ వద్ద ఉన్న మహీంద్రా సర్వీస్ సెంటర్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెంటర్‌లోని స్క్రాప్ యార్డ్‌లో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనతో దట్టమైన పొగతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.