న్యూ ఇయర్ వేళ హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు సీపీ సజ్జనార్. రాత్రి 1 గంట వరకే ఈవెంట్లకు అనుమతి ఉంటుందని, రాత్రి 7 నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. తాగి డ్రైవింగ్ చేస్తే జరిమానా, జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. బ్యాక్‌డోర్ మద్యం విక్రయాలు నిషేధమని, సమాజానికి తోడుగా నిలవడమే నిజమైన వేడుక అని సజ్జనార్ పేర్కొన్నారు.