తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు

1చూసినవారు
తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న విడుదల చేసిన జీవో 1342 ప్రకారం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడం చట్టవిరుద్ధమని వడ్ల శ్రీకాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద, శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు కల్పించారో డిసెంబర్ 10వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్