రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

0చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో 8 భారీ టవర్స్ అక్రమంగా నిర్మిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మురళి నాయక్, రాకేష్ రెడ్డి వేసిన పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం, 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, బిల్డర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్