
నేడు శ్రీసత్యసాయి జిల్లాలో చంద్రబాబు పర్యటన
AP: సీఎం చంద్రబాబు శనివారం శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. కదిరి నియోజకవర్గంలోని పెద్దన్నవారిపల్లిలో మధ్యాహ్నం 12.45 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, పింఛన్ లబ్ధిదారులతో ముచ్చటించిన అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు.




