జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సమాజం పవన్ కల్యాణ్ వద్ద జాతీయవాదం గురించి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని
కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పిన పవన్, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణలో సభ ఎందుకు పెట్టాలనుకున్నారని ప్రశ్నించారు. జనసేనను ఎవరూ అడ్డుకోలేదని, ఆయన్ను అడ్డుకుంది ప్రజలేనని
కేటీఆర్ పేర్కొన్నారు. ప్రాంతీయవాదం, ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని మాట్లాడుతున్న పవన్, ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని తప్పుపడతారా అని నిలదీశారు. తెలంగాణ సెక్రటేరియట్‌లో కూర్చొని పెత్తనం చేస్తామంటే ఊరుకునేది లేదని, ఓజీ
కేసీఆర్ అని
కేటీఆర్ అన్నారు.