హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగ ముగిశాయి: సజ్జనార్

0చూసినవారు
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగ ముగిశాయి: సజ్జనార్
హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తయ్యాయని వీసీ సజ్జనార్ వెల్లడించారు. పోలీసులు అమలు చేసిన కఠిన నిబంధనలు, విస్తృత స్థాయిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, అలాగే ప్రజల సహకారం వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది, ఇతర శాఖలు, నగరవాసులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. నగర భద్రతకు అందరూ సహకరించినందుకు అభినందించారు.