జగిత్యాలలో రైతుల పక్షాన మాట్లాడిన డ్రైవర్ అశోక్‌ను ఉద్యోగం నుండి తొలగించారనే వార్తలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. అశోక్ ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ అని, ఆర్టీసీ ఉద్యోగి కాదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ అతన్ని విధుల్లోంచి తొలగించవద్దని బస్సు యాజమాన్యానికి సూచించామని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై
కాంగ్రెస్ నిరసన చేపట్టగా, బస్సు డ్రైవర్ అశోక్ మంత్రిని ఉద్దేశించి "ముందు వడ్లు, మక్కలు కొనడంపై దృష్టి పెట్టండి" అని కౌంటర్ ఇచ్చారు.