ప్రభుత్వ సాయంతో నెలకు రూ.50 వేలు: డెయిరీ రంగంలో స్వయం ఉపాధికి బంపర్ ఆఫర్

1చూసినవారు
ప్రభుత్వ సాయంతో నెలకు రూ.50 వేలు: డెయిరీ రంగంలో స్వయం ఉపాధికి బంపర్ ఆఫర్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు విజయ డెయిరీ పార్లర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 400కి పైగా డెయిరీ పార్లర్లను తెరవాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, సిద్దిపేట, మహబూబ్ నగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్లర్ల ద్వారా నిరుద్యోగులు ప్రభుత్వ సహాయంతో నెలకు రూ.50 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ పథకంలో ఎలా చేరాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత పోస్ట్