తల్లి మరణించిన 2 నెలల్లోనే కొడుకు ఆత్మహత్య: విషాదం

0చూసినవారు
తల్లి మరణించిన 2 నెలల్లోనే కొడుకు ఆత్మహత్య: విషాదం
హైదరాబాద్‌లోని మార్కండేయ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి మరణించిన రెండు నెలలు కూడా తిరగకముందే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. మైలార్‌దేవపల్లిలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ కొముర రెడ్డి, తన తల్లి మరణాన్ని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయి, మద్యం బానిసయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం (మే 27) తెల్లవారుజామున తన నివాసంలో కొముర రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్