పోలీసులకు పుట్టినరోజు, పెళ్లిరోజున ప్రత్యేక సెలవులు: డీజీపీ శివధర్ రెడ్డి

0చూసినవారు
పోలీసులకు పుట్టినరోజు, పెళ్లిరోజున ప్రత్యేక సెలవులు: డీజీపీ శివధర్ రెడ్డి
తెలంగాణ పోలీసు శాఖలో కీలక మార్పులు చేస్తూ, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పోలీసుల వ్యక్తిగత జీవితాలకు ప్రాధాన్యతనిస్తూ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. నిరంతర విధి నిర్వహణలో కుటుంబానికి సమయం కేటాయించలేని పోలీసుల కోసం, ఇకపై ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమ పుట్టినరోజు, పెళ్లిరోజు నాడు కుటుంబంతో గడిపేందుకు ప్రత్యేక సెలవు పొందవచ్చని ప్రకటించారు. సమాజ రక్షణ కోసం పోలీసులు తమ వ్యక్తిగత సంతోషాలను త్యాగం చేస్తున్నారని, వారి మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని డీజీపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్