రివాల్వర్ తాకట్టు పెట్టిన ఎస్సై భాను ప్రకాష్ అరెస్టు

4చూసినవారు
రివాల్వర్ తాకట్టు పెట్టిన ఎస్సై భాను ప్రకాష్ అరెస్టు
బెట్టింగ్ అప్పులు తీర్చడానికి రికవరీ సొమ్ముతో పాటు తన సర్వీస్ రివాల్వర్‌ను తాకట్టు పెట్టిన అంబర్‌పేట్ ఎస్సై భాను ప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నాడు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. రివాల్వర్ పోయిందని మొదట ఫిర్యాదు చేసిన భాను ప్రకాష్, విచారణలో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు పోయిందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. రికవరీ చేసిన బంగారం, సర్వీస్ రివాల్వర్‌ను తాకట్టు పెట్టినందుకు ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్