భర్తను కిడ్నాప్‌ చేయించిన మొదటి భార్య

5చూసినవారు
భర్తను కిడ్నాప్‌ చేయించిన మొదటి భార్య
నగరంలో జరిగిన కిడ్నాప్‌ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. తన మాజీ భర్త, మంత్రి శ్యామ్‌ను హత్య చేయించాలని పథకం పన్నిన మొదటి భార్య మాధవిలత (51)ను అంబర్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లోని 600 చదరపు గజాల స్థలాన్ని విక్రయించగా వచ్చిన రూ.16 కోట్లను చేజిక్కించుకోవాలని ఈ పథకం రచించినట్లు తెలిసింది. గత నెల 29న జరిగిన కిడ్నాప్‌ను సాంకేతిక ఆధారాలతో ఛేదించిన పోలీసులు, మాధవిలతతో పాటు ఈ పథకంలో పాలుపంచుకున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో ఉన్న శ్యామ్, మాధవిలతలు విడాకులు తీసుకున్న తర్వాత శ్యామ్ ఫాతిమాను రెండో వివాహం చేసుకున్నాడు. తన మాజీ భర్తను హత్య చేయించడానికి కట్ట దుర్గాప్రసాద్‌ అలియాస్‌ సాయితో రూ.1.50 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. కిడ్నాపర్లు శ్యామ్‌ను విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంకు తరలించారు. మాధవిలతను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కిడ్నాపర్లు శ్యామ్‌ను ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక తిప్పారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్