రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఒక బైకర్ తన డ్యూక్ బైక్ (TS10EK9777) నెంబర్ ప్లేట్‌కు అయస్కాంతం అమర్చి పోలీసుల తనిఖీల్లో దొరికిపోయాడు. పోలీసులు బైక్‌ను సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ నియమాలను పాటించాలని, ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.