
మెహిదీపట్నం రోడ్డుపై రెచ్చిపోయిన యువకులు
మెహిదీపట్నం రోడ్డుపై నెంబర్ ప్లేట్ లేని బైక్‌లపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ, డైరీ ఫార్మ్ నుండి మెహదీపట్నంకి వెళ్లే దారిలో కొందరు యువకులు ఒక గుర్రాన్ని విచక్షణారహితంగా కొడుతూ, హింసిస్తూ ప్రధాన రోడ్డుపై నానా హంగామా చేశారు. ఇతర వాహనాల శబ్దాలకు గుర్రం భయపడి ఎటువైపు అయిన తిరిగితే తోటి వాహనదారులకు ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు అని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

































