బోడుప్పల్‌ లో యువకుడిపై బ్లేడ్‌తో దాడి.. మెడపై గాయాలు

253చూసినవారు
బోడుప్పల్‌ లో యువకుడిపై బ్లేడ్‌తో దాడి.. మెడపై గాయాలు
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్‌లో పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై బ్లేడ్‌తో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. ఇందిరానగర్‌కు చెందిన మంద సాయి కుమార్ (26) తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి బయటకు వచ్చినప్పుడు, చిలుకానగర్ వైపు నుంచి వచ్చిన జాన్, పవన్‌తో పాటు మరికొందరు పాత విభేదాల కారణంగా వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో జాన్ తన వద్ద ఉన్న పదునైన బ్లేడ్‌తో సాయి కుమార్ మెడపై దాడి చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్