హైదరాబాద్‌లోని కిషన్ బాగ్ ప్రాంతంలో గల సోఫా వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి, లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్, ప్లైవుడ్ కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది స్పందనపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో సహాయక చర్యలు అందకపోవడంతో ఆస్తి నష్టం భారీగా జరిగిందని వారు తెలిపారు.