బహదూర్ పురా: సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ

78చూసినవారు
బహదూర్ పురా: సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ
సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరంగా మారిందని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బేగ్ అన్నారు. శుక్రవారం ఎంఐఎం కార్యాలయంలో లబ్దిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్సీ పంపిణీ చేశారు. మొత్తం 40 మందికి చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్సీ పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా పొందేందుకు సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకుంటే త్వరగా చెక్కులు మంజూరయ్యేలా చూస్తామన్నారు.

సంబంధిత పోస్ట్