సోమనాథ్ స్వాభిమాన పర్వ్‌లో బీజేపీ చీఫ్ ప్రత్యేక పూజలు

162చూసినవారు
సోమనాథ్ స్వాభిమాన పర్వ్ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని శివాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమనాథ్ దేవాలయాన్ని రక్షించేందుకు ప్రాణాలను అర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకోవడానికే ఈ కార్యక్రమం అని ఆయన తెలిపారు. ఆలయాల చరిత్రను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్