మెట్రోపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు: ఎమ్మెల్యే

476చూసినవారు
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మేడ్చల్ మెట్రో రైలు సాధన సమితితో కలిసి కొంపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెట్రో రైలు విస్తరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర నిధులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మెట్రో సాధన సమితితో కలిసి ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మెట్రో సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్