మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు.
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, సెక్రటేరియట్, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం, ప్రగతి భవన్ ఎవరు కట్టారని ఆయన ప్రశ్నించారు. ఒక రాష్ట్రాన్ని సాధించి, భారతదేశ చిత్రపటంలో పెట్టిన
కేసీఆర్ ఆనవాళ్లను ఎలా తీస్తారని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.