ఎస్టీలకు రిజర్వేషన్లలో అన్యాయం: ఎన్‌బీఎంఐ ఆందోళన

38చూసినవారు
ఎస్టీలకు రిజర్వేషన్లలో అన్యాయం: ఎన్‌బీఎంఐ ఆందోళన
రిజర్వేషన్ల అమలులో షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీలు) తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎన్‌బీఎంఐ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు రవి రాజ్ రాథోడ్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం కీసరలోని స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల ప్రకారం కనీసం 12 చైర్మన్ పదవులు కేటాయించాల్సి ఉండగా, ప్రభుత్వం కేవలం ఐదు పదవులకే పరిమితం చేయడం అన్యాయమని విమర్శించారు. అలాగే, 2,996 వార్డుల్లో సుమారు 300 వార్డులు రావాల్సి ఉండగా, కేవలం 175 వార్డులనే కేటాయించారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రభుత్వం వెంటనే లోపాలను సరిదిద్దాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్