గౌరా ఎయిరో స్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం

1436చూసినవారు
నగర శివారులోని ఆదిభట్లలో ఉన్న గౌరా ఎయిరో స్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సమీపంలో జరిగిన ఈ ఘటనకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, నష్టంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్