చాదర్‌ఘాట్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను శనివారం AIMIM ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా పరిశీలించారు. జంట జలాశయాల గేట్లు తెరవడంతో మూసి నది ఉద్ధృతంగా ప్రవహించి, పలు కాలనీలు నీట మునగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు డ్రోన్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారికి ఆహార ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు అందిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు.