రాష్ట్రంలో ఇంధన కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. అందుబాటులో ఉన్న బంకుల వద్ద వాహనాల భారీ క్యూలు ఏర్పడుతున్నాయి. స్టాక్ లేక బంకులు మూతపడటంతో రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కార్యాలయాలకు వెళ్లేవారు, సామాన్య ప్రజలు పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.