ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి పోలీసుల అవగాహన

503చూసినవారు
ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి పోలీసుల అవగాహన
కుత్బుల్లాపూర్ జోనల్ పోలీసుల ఆధ్వర్యంలో మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ విక్రేతలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీ ఎన్‌. కోటి రెడ్డి మాట్లాడుతూ, నేరాల నియంత్రణలో సీసీటీవీ వ్యవస్థలు, సెక్యూరిటీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పిఎస్ఏఆర్ చట్టం ప్రకారం ప్రతి ఏజెన్సీ తప్పనిసరిగా నమోదు చేసుకొని పోలీసులతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్