కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఒకే ఫీజు: యుఎస్ఎఫ్ఐ డిమాండ్

108చూసినవారు
కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఒకే ఫీజు: యుఎస్ఎఫ్ఐ డిమాండ్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కార్పొరేట్ కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చుతున్నాయని యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ ఆరోపించారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలలో ఒకే ఫీజు ఉండే విధంగా ప్రభుత్వం తగిన ప్రణాళికలను రూపొందించాలని ఆయన కోరారు. షాపూర్ నగర్ లో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫీజుల నియంత్రణ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్