గత 10 సంవత్సరాలుగా కిమ్స్ గ్రూప్ అఫ్ హాస్పిటల్స్ మెనేజింగ్ డైరెక్టర్ డా. బొల్లినెని భాస్కర్ రావు ముఖ్య మార్గదర్శకంలొ బొల్లినేని మెడ్ స్కిల్స్ డిగ్రీ, ఇంటర్, 10th చదివిన వారికి వైద్య రంగంలో హెల్త్ కేర్ బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్ & జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (నర్సింగ్ అసిస్టెంట్) గా ఉచిత శిక్షణనిచ్చి మరియు ఉద్యోగం కల్పిస్తున్నామని బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ Ch. నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 12000 లకు పైగా నిరుద్యోగ యువతి యువకులకు శిక్షణని ఇచ్చి, ఉపాధి కల్పించామన్నారు. ప్రస్తుతం క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ వారి సహకారం తో క్రిస్టియన్ మైనారిటీ నిరుద్యోగ యువతి యువకులకు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ( నర్సింగ్ అసిస్టెంట్) గా ఉచిత శిక్షణ కు సంబంధించి హాస్పిటల్ లో ప్రాథమిక నర్సింగ్ విధానంపై అవగాహన కల్పిస్తూ, కంప్యూటర్ టైపింగ్, ఎమ్మెస్ ఆఫీస్ (ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్, ఇంటర్నెట్ ) , స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, హాస్పిటల్ లో GDA గా ఉద్యోగం కల్పిస్తామన్నారు.
శిక్షణ కాలం : 3 నెలలు.
అర్హత : ఇంటర్ పాస్ / ఫెయిల్
వయస్సు: 18 నుండి 27 సం. వరకు
ఇంటర్ బైపీసీ చదివిన వారికి B. Sc. పారామెడికల్ కాలేజీ నందు అడ్మిషన్ లు జరుగుచున్నవి.
శిక్షణకు సంభందించి నూతన బ్యాచ్ లను వారం రోజులలో ప్రారంభిస్తున్నాము. కావున ఆశక్తి కలిగిన నిరుద్యోగ యువతీయువకులు తమ అర్హత సర్టిఫికెట్స్ మరియు ఆధార్ కార్డు లతో ఈ క్రింది చిరునామాలో నేరుగా సంప్రదించాలి.
చిరునామా : బొల్లినేని మెడ్ స్కిల్స్
4th floor, old కిమ్స్ - సన్ షైన్ హాస్పిటల్ క్యాంపస్,
ప్యారడైజ్ ప్రక్కన, సికిందరాబాద్
పూర్తి వివరాలకు 8217774749, 7680945357 సంప్రదించండి.