
విశ్వహిందూ పరిషత్ లో పగుడాకుల బాలస్వామికి కీలక బాధ్యతలు
విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ గా పగుడాకుల బాలస్వామి నియమితులయ్యారు. స్వామీజీల సమన్వయం, ధర్మ రక్షణ కోసం కృషి చేస్తానని బాలస్వామి తెలిపారు. మఠాలు, పీఠాలు, దేవాలయాల కేంద్రంగా హిందుత్వం ముందుకు సాగేలా పనిచేస్తామని, కులాల మధ్య అంతరాలను తొలగించి హిందూ సమాజాన్ని ఏకం చేస్తామని ఆయన పేర్కొన్నారు. మతం మారిన వారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకువస్తామని, దేవాలయాలు, సాధుసంతులపై దాడులను అరికట్టేందుకు పోరాడతామని బాలస్వామి అన్నారు. హిందుత్వం బలపడితేనే భారతదేశం నిలబడుతుందని, ప్రతి హిందువు సంఘటితం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. బౌద్ధ, జైన, సిక్కు ధర్మాల వారినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు.






































