వాకింగ్ ట్రాక్ స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

551చూసినవారు
వాకింగ్ ట్రాక్ స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట్ స్నేక్ పార్క్ స్థలాన్ని జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వేణుమాధవరావు బుధవారం సాయంత్రం పరిశీలించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సిఫారసు లేఖను అందజేయగా, ఎమ్మెల్సీ కూడా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారాన్ని కోరారు. ఈ నేపథ్యంలో, వేణుమాధవరావు స్థలాన్ని పరిశీలించి, త్వరలోనే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ ప్యాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎస్. వి. సురేందర్ రెడ్డి, ధర్మారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్