కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప, సింహపురి కాలనీలలో శుక్రవారం మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.