రాష్ట్రంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు సాధించిన సగటు మార్కుల ఆధారంగా సబ్జెక్టు టీచర్లకు గ్రేడింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ గ్రేడింగ్ ను ఉపాధ్యాయుల అవార్డులకు కూడా ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ విధానం రాబోయే రోజుల్లో అమలు చేయబడుతుంది.