సంక్రాంతి పండుగ, వారాంతపు సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ వాసులు సొంత ఊళ్లకు తరలివెళ్లడంతో నగరంలోని హైటెక్ సిటీ, రాయదుర్గం, గచ్చిబౌలి, మియాపూర్, తిరుమలగిరి, అత్తాపూర్, శంషాబాద్ వంటి ప్రధాన రహదారులపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది. చాలా చోట్ల రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయని నగరవాసులు తెలిపారు.