
15000 మందిని చంపడమే నా టార్గెట్: ఫయాజ్
ముంబైలో మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని భారీ ప్రాణనష్టం కలిగించే కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఊరేగింపులో విషపు క్యాప్సూల్స్ పంపిణీ చేసి మారణహోమం సృష్టించాలని ప్రయత్నించిన ఫయాజ్ అనే వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి నుంచి 14,900 విషపు పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, అతను మరో 30,000 క్యాప్సూల్స్, 50 కిలోల ఎలుకల మందును ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. 15,000 మందిని చంపడమే తన లక్ష్యమని, దీన్ని గొప్ప కార్యంగా భావిస్తున్నానని నిందితుడు వెల్లడించాడు.




