జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుకు సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ నుండి నాంపల్లి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అభిమానుల నినాదాలతో విమానాశ్రయ పరిసరాలు హోరెత్తాయి.