రోడ్డు విస్తరణతో ట్రాఫిక్ సమస్యలకు చెక్: వెంకటేష్ గౌడ్

181చూసినవారు
రోడ్డు విస్తరణతో ట్రాఫిక్ సమస్యలకు చెక్: వెంకటేష్ గౌడ్
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఉషముళ్లపూడి ప్రధాన రహదారిలో ఎల్లమ్మబండ రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తగ్గుతాయని మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఎల్లమ్మ చెరువు పెట్రోల్ బంక్ సమీపంలో మ్యాన్‌హోల్స్ నుంచి వరదనీరు రోడ్డుపైకి రావడంతో ఆయన జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆదేశాలతో నిలిచిన నీటిని మోటార్ల సహాయంతో తొలగించారు. రోడ్డు పనుల కారణంగా డ్రైనేజీ పైప్‌లైన్ దెబ్బతినడంతో సమస్య ఏర్పడిందని, ప్రజలు సహకరించాలని వెంకటేష్ గౌడ్ కోరారు.

సంబంధిత పోస్ట్