హిమాయత్‌సాగర్‌లో విషాదం: స్నేహితుల ప్రాణాలు బలిగొన్న చేపల వేట

3చూసినవారు
హిమాయత్‌సాగర్‌లో విషాదం: స్నేహితుల ప్రాణాలు బలిగొన్న చేపల వేట
హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పరిధిలో వీకెండ్ సందర్భంగా హిమాయత్‌సాగర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. చేపలు పట్టిన తర్వాత ఈత కొట్టేందుకు నీటిలోకి దిగగా, లోతు ఎక్కువగా ఉండటంతో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు ఒక యువకుడిని రక్షించగా, షేక్ సల్మాన్, షాహెబాజ్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.