
దొంగతనం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
ఉమ్రా యాత్రకు వెళ్లిన కుటుంబానికి సన్నిహితులే నమ్మకద్రోహం చేశారని హబీబీనగర్ పోలీసులు తెలిపారు. కుటుంబం ఇంట్లో లేని సమయంలో ఇద్దరు బంధువులు, 12 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగితో కలిసి పెళ్లి కోసం దాచిన రూ.29 లక్షలు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దొంగిలించారు. సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్ ఆధారాలు, వేలిముద్రల సహాయంతో పోలీసులు కేసును ఛేదించి ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.



































