రాజధాని లోనే సద్గురు సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

262చూసినవారు
బంజారాలకు ఆరాధ్య దైవమైన సద్గురు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని బంజారా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అజ్మీరా పూల్ సింగ్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం నాయకులు వెంకట బంజారా మాట్లాడారు. సేవాలాల్ విశిష్టతను గుర్తించి విగ్రహ ఏర్పాటుకు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే మహారాజు విగ్రహాన్ని ఓ మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తున్నట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్