తెలంగాణ హైకోర్టుకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో హైకోర్టుకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. కోర్టు ప్రాంగణంలో అనుమానాస్పద వస్తువుల కోసం గాలిస్తున్నారు. ముందు జాగ్రత్తగా సిబ్బంది, న్యాయవాదులను అప్రమత్తం చేశారు. న్యాయమూర్తుల ఛాంబర్లు, కోర్టు హాళ్లు, రిజిస్ట్రీ, పార్కింగ్ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. తనిఖీలు పూర్తయ్యే వరకు లోపలికి రావద్దని అధికారులు సూచించారు.